క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి- పవన్ 11 h ago
AP: తొక్కిసలాటలో భక్తుల మృతి బాధాకరం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి, వారికి మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీ పాలకమండలి తీసుకోవాలని సూచించారు. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతిలోని టికెట్ కౌంటర్ల వద్ద అధికారులకు, పోలీసులకు జనసైనికులు తోడ్పాటు అందించాలని పవన్ కోరారు.